Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రథమ వర్థంతి సందర్భంగా భారీ ప్రదర్శన, బహిరంగ సభ
అ పాల్గొన్న న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు పీ.టాన్య,
అశోక్ గాయాల్, చిట్టిపాటి, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-ఇల్లందు
ప్రతిఘటన పోరాట పంథాను సజీవంగా ఉంచడంలో ఎస్కె.ముక్తార్ పాష ముందు పీఠిన నిలిచాడని న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు పీ.టాన్య, అశోక్ గాయాల్, చిట్టిపాటి, రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావులు కొనియాడారు. కేంద్ర కమిటీ సభ్యులుగా, ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇల్లందు కేంద్రంగా పనిచేసిన ముక్తార్ పాష గత ఏడాది సెప్టెంబర్ 24న కరోనాతో మృతి చెందారు. ఈ సందర్భంగా ప్రధమ వర్ధంతి సభను ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల న్యూ డెమోక్రసీ కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కొత్త బస్టాండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముక్తార్ పాషాపై రాసిన పాటల సీడీ, పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ అరుణోదయ కళాకారులు ఆటలు, పాటలు పాడారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. 1969లో గోదావరి లోయలో చండ్ర పుల్లారెడ్డి రూపొందించిన ప్రతిఘటన పోరాటంపై అంచల విశ్వాసంతో ముక్తార్ పాషా పని చేశారని కొనియాడారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో విప్లవ కార్మిక ఉద్యమంలో అగ్ర నాయకుడిగా ఎదిగాడని అన్నారు. 40 ఏండ్లుగా ప్రజా సమస్యలపై ఉద్యమించారని అన్నారు. లాఠీ దెబ్బలు లాకప్ జైలు నిర్బంధాలు చవిచూశాడని అన్నారు. దీర్ఘకాలిక రాజకీయ సాయుధ పోరాట పంధా కాపాడుకోవడమే ముక్తార్ పాషాకు ఇచ్చే నివాళి అన్నారు.