Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ శ్రీరామాయణ పారాయణ
మహౌత్సవాలు
అ వివరాలు వెల్లడించిన దేవస్థానం
ఈవో, స్థానాచార్యులు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శరన్నవరాత్రోత్సవ ప్రయుక్త విజయదశమి శ్రీరామాయణ పారాయణ మహౌత్స వాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో బి.శివా జీ, స్థానాచార్యులు కేఈ స్థలశాయిలు తెలిపారు. భద్రాచలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ అక్టోబరు ఆరు నుంచి 15 వరకు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో శ్రీరామాయణ పారాయణం నిర్వహించేం దుకు ఆసక్తి గల భక్తులకు వారు ఆహ్వానం పలికు తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబందించి వెబ్సైట్లో సామాజిక మాధ్యమాల్లో అభీష్టపత్రం పీడీఎఫ్ ''ఫైలు పోస్టు చేశామని తెలిపారు. ఆ పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్ లోడు చేసి వివరాలు నింపి దేవస్థానం ఈవో కార్యాలయంకు పంపాలని సూచించారు. భద్రాద్రి రామాలయంలో నిర్వహించే ఉత్సవాలకు వచ్చే సమయంలో ఆ పత్రాన్ని తమ వెంట తీసుకురా వాలని సూచించారు. శ్రీరామాయ పారాయణంలో పాల్గొనేందుకు గరిష్టంగా 108 మంది భక్తులను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. పారాయణంలో పాల్గొనే వారికి ఉచిత భోజన, వసతి సదుపాయంను దేవస్థానమే కల్పిస్తుందని పేర్కొన్నారు. 15వ తేదీన శ్రీరామాయ ణ పారాయణ సమాప్తిని పురస్కరించుకొని నిర్వహించే శ్రీరామ మహాపట్టాభిషేకం అనంతరం పారాయణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అనుగ్రహ పత్రాలు అందజేయనున్నట్లు వారు తెలిపారు. వీటితో పాటు స్వామి వారి ప్రసాదం, శేష వస్త్రం అందజేస్తా మన్నారు. భద్రాద్రి రామాలయంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న శ్రీరామాయణ పారాయణం యధావిధిగా సాగుతుందని. ఇదే సమయంలో చిత్రకూట మండపంలో సాగే శ్రీరామాయణ పారాయణంలో 108 మంది పారాయ దారులకు పుస్తకాలు దేవస్థానమే సమకూర్చుతుందని తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో భద్రాద్రి దేవస్థానం ఏఈఓలు శ్రావణ్ కుమార్, భవానీ రామకష్ణారావు, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు పాల్గొన్నారు.