Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రదర్శనా ర్యాలీ నిర్వహించిన అఖిలపక్ష పార్టీలు
నవతెలంగాణ-దమ్మపేట
భారత్ బంద్‌ను విజయంతం చేయాలని శుక్రవారం అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, కుల సంఘాలు, ఆధ్వర్యంలో మోటార్ సైకిల్‌ర్యాలీ ప్రారంభిస్తుండగా స్థానిక పోలీస్ అధికారులు వచ్చి ర్యాలీని అడ్డుకొని నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు అమర్లపూడి రాము, సీపీఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు, సీపీఐ(ఎం) నాయకులు మోరంపూడి శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు సత్యప్రసాద్, తెలుగుదేశం నాయకులు వలీబాషాలతో స్థానిక ఎస్ఐ శ్రావణ్ మాట్లాడి ర్యాలీని నిలిపివేశారు. అనంతరం నాయకులు జయలకిë టాకీస్ నుండి సీపీఐ కార్యాలయం వరకు సుమారు 200 మందితో ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దొడ్డా లకిëనారాయణ, శ్రీను, పిల్లి నాయుడు, సీపీఐ(ఎం) కార్యకర్తలు సత్యం, లకిëనారాయణ, తెలుగుదేశం కార్యకర్తలు, దుర్గఅక్క, రవి, వెంకటేశు, నారాయణ, ముత్యాలరావు, సిపిఐఎంఎల్ కార్యకర్తలు, చిలక శ్రీను, రాంబాబు, సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.