Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రైతన్నను దివాలా తీయించే చీకటి చట్టాలను రద్దు చేయాల్సిందే
అ విలేకర్ల సమావేశంలో వామపక్ష, విపక్ష పార్టీల జిల్లా నేతలు
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలు, నల్లచట్టాలను నిరసిస్తూ ఈ నెల 27న జరిగే భారత్ బంద్ పాలకులకు హెచ్చరిక కావాలని వామపక్ష, విపక్ష పార్టీల నేతలు అన్నారు. నూతన వ్యవసాయ సాగు చట్టాలు, విద్యుత్ సంస్కరణల చట్టం, ఇందన ధరలు, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరల పెంపు, కార్మిక చట్టాల సవరణను నిరసిస్తూ ఈనెల 27న జరగనున్న భారత్ బంద్ ప్రచారంలో భాగంగా శుక్రవారం సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా, కాంగ్రెస్ జిల్లా నాయకులు లక్కినేని సురేందర్, న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు, టీడీపీ జిల్లా అధ్యక్షులు కాప కృష్ణమోహన్ మాట్లాడారు. దేశ ప్రధాన మోడీ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని, ప్రజలకోసం కాకుండా అదాని, అంబానీల వంటి పెట్టుబడిదారులకోసమే పనిచేస్తున్నాడని విమర్శించారు. భారత్ బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. ఈ విలేకర్ల సమావేశంలో సీపీఐ జిల్లా నాయకులు గుత్తుల సత్యనారాయణ, వై.శ్రీనివాసరెడ్డి, నూనావత్ గోవిందు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, ధర్మ, లిక్కి బాలరాజు, న్యూడెమోక్రసి నాయకులు ముద్దా బిక్షం, కె.సురేందర్, టీడీపీ నాయకులు రమణారావు, మోహనాచారి, నాని, కోటయ్య, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.