Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్కీం వర్కర్స్ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయి బాబు అన్నారు. పాల్వంచలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా భారీ ర్యాలీ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, నగర దీపికలు, స్వచ్ఛ కార్మికులు, ఐకేపీ, వివోఏలు శుక్రవారం పట్నంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సాయిబాబు, జిల్లా సహాయ కార్యదర్శి ఎర్రగాని కృష్ణయ్య సమ్మెకు మద్దతు తెలియజేశారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పాల్వంచ పట్టణ కార్యదర్శి దొడ్డ రవికుమార్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మెరుగు ముత్తయ్య, పాల్వంచ అల్లూరు సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ స్వామికి అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ పాల్వంచ పట్టణ కార్యదర్శి గూడెపూరి రాజు అధ్యక్షతన జరిగిన సభలో సాయిబాబా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం స్కీం వర్కర్స్ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దానికి వంతుగా టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తున్నారని, దేశ ప్రజలకు ఉపయోగం స్కీములనుల ఉన్న వాటిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. వాటికి అడ్డుకట్ట వేయడం కోసం పోరాటం నిర్వహించాలన్నారు. కనీస వేతనం రూ.21,000 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, స్కీమ్ వర్కర్ల ప్రభుత్వం గుర్తించాలని, స్కీం వర్కర్లకు రూ.పదివేల పెన్షన్ ఇవ్వాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ ర్యాలీ ధర్నా కార్యక్రమంలో బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గురం రాములు, అంగన్వాడీ యూనియన్ నాయకులు, ఆశ వర్కర్లు, మధ్యాహ్న భోజన నాయకులు, స్వచ్ఛ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం : ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లకు పనిభద్రత కల్పించడంతో పాటు, కనీస వేతనాలు అమలు కోసం ఉద్యమాలు చేపట్టాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.అప్పారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, పిలుపు నిచ్చారు. స్కీమ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ దేశవ్యాపిత సమ్మెలో భాగంగా స్కీమ్ కార్మికులు శుక్రవారం సమ్మె నిర్వహించారు. సమ్మె సందర్భంగా శేషగిరిభవన్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టి డిమాండ్ల వినతి పత్రాన్ని జిల్లా అధికారులకు అందించారు. అనంతరం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటియూ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు డి.వీరన్న, రాంచందర్, బి.వెంకన్న, స్కీమ్ వర్కర్స్ యూనియన్ నాయకురాళ్ళు ఎస్.విజయలక్ష్మి, ఎన్.నిర్మల, కె.పద్మ, సుగుణ, రాజేశ్వరి, స్వప్న, రాములమ్మ, సమ్మక్క, విజయ తదితరులు పాల్గొన్నారు.
చర్ల : ప్రభుత్వ రంగ స్కీములు ఉంటేనే పేద ప్రజలకు సక్రమమైన సేవలు అందుతాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మచారి అన్నారు. శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించి ఆయన మాట్లాడారు. స్కీం వర్కర్లకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సీఐటీయూ మండల నాయకురాలు విజయశీల అధ్యక్షత సమ్మెలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగట్టారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్కీమ్ వర్కర్లకు బడ్జెట్ కొరత పెట్టి వారి సంక్షేమాన్ని నీరుగారుస్తుందని ఆయన విమర్శించారు. అనంతరం పలు సమస్యలతో కూడిన మెమోరాండం తహసీల్దార్ నాగేశ్వరరావుకు నాయకులు అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పాయం రాధాకుమారి, స్కీమ్ వర్కర్ల నాయకురాళ్లు చంద్రకళ, రాంబాయి, రాజేశ్వరి, సమ్మక్క, కృష్ణవేణి, ఆనసూర్య, విజయలక్ష్మి, స్వరూప, ఆటో యూనియన్ నాయకులు బాలాజీ, కేవీపీఎస్ నాయకులు వినోద్, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు.
భద్రాచలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలలో పని చేస్తున్న స్కీమ్ వర్కర్స్ దేశ వ్యాప్త సమ్మె సందర్భంగా శుక్రవారం భద్రాచలం పట్టణంలో అంబేడ్కర్ సెంటర్లో సమ్మె శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు మాధవీలత అధ్యక్షతన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జే.రమేష్ మాట్లాడుతూ దేశంలో, వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వ పథకాలలో పని చేస్తున్న స్కీమ్ వర్కర్స్‌కి కనీస వేతనం ఇవ్వకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రం వేతనాలు లక్షల్లో పెంచుకుంటున్నారని ఆయన విమర్శించారు.
కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చిన మోడీ ప్రభుత్వం కార్మికుల శ్రమని మరింతగా దోచుకోవడానికి తప్ప వేరే కాదన్నారు. బీజేపీ, టీఆర్‌యస్ ప్రభుత్వాలకు వ్యతిరేఖంగా లబ్దిదారులను ఐక్యం చేసి ప్రజా ఉద్యమాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.
ప్రదర్శన...సబ్ కలెక్టరేట్ ముందు ధర్నా
భద్రాచలం అంబేడ్కర్ సెంటర్ నుండి సినిమా హాల్స్, యు.బి.రోడ్ మీదుగా సబ్ కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి ఏఓ శేషగిరికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు యం.బి. నర్సారెడ్డి, ఐద్వా పట్టణ కార్యదర్శి మర్లపాటి రేణుక, సీఐటీయూ పట్టణ నాయకులు బండారు శరత్ బాబు, గడ్డం స్వామి, నాగరాజు, యంవియస్ నారాయణ, అంగన్వాడీ యూనియన్ నాయకులు సావిత్రి, విజయలక్ష్మి, ఝాన్సీ, రమణమ్మ, ఆశా నాయకురాలు నర్సమ్మ, సావిత్రి, ఐకెపి విఓఏ నాయకురాలు చంద్రలీల, వెంకట లక్ష్మీ, మధ్యాహ్నం భోజనం నాయకులు శివమ్మ, రాజేశ్వరి, రమా తదితరులు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో స్కీం వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.