Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం నామ నాగేశ్వరరావు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఆహార ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం కేసీఆర్ సోమవారం భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్ర మంత్రితో సమావేశం అయ్యారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఎంపీ నామ నాగేశ్వరరావుతో సీఎం కేసీఆర్ శాలువా కప్పించారు. సీఎం కేసీఆర్ వెంట రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎంపీలు కేఆర్ సురేష్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, సీఎస్ సోమేష్ కుమార్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సివిల్ సప్లై అధికారులు ఉన్నారు.
తెలంగాణ కోసం పరితపించిన కొండా లక్ష్మణ్ బాపూజీ:
తుది శ్వాస వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పరితపించారని టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ వాది, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళి అర్పిస్తూ ఎంపీ నామ నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్య్ర పోరాటంతోపాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటం చేశారన్నారు. తెలంగాణ తొలి దశ పోరాటంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ సాధన కోసం మంత్రి పదవిని వదిలిపెట్టి త్యాగశీలిగా నిలిచారన్నారు.
తుఫాన్ ప్రభావంపై ఆరా తీసిన ఎంపీ నామ
గులాబ్ తుఫాన్ తీవ్రతపై టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సోమవారం ఆరా తీశారు. కురుస్తున్న భారీ వర్షాల జిల్లాలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీ నామ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గులాబ్ తుఫాన్‌తో జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై పలువురు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో తలెత్తిన ఇబ్బందులపై స్వయంగా ఆరా తీశారు. గులాబ్ తుఫాన్ మరింతగా బలపడి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎంపీ నామ అలర్ట్ చేశారు. తుఫాన్ మరింతగా బలపడి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో అధికారులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహారించాలని సూచించారు. రెవెన్యూ, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటి, పోలీస్, ఆర్అండ్బీ, పంచాయతీ శాఖల అధికారులు సమన్వయంతో గులాబ్ తుఫాన్ విపత్తు నుంచి బయటపడడం కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. వాగులు పొంగి ప్రవహించే రహదారుల వద్ద పోలీసు బందోబస్తుతోపాటు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టాలను సంభవించకుండా క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎంపీ నామ కోరారు.