Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అభివర్ణించారు. కలెక్టరేట్లో కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి వేడుకలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ చిత్రపటానికి కలెక్టర్ కృష్ణ ఆదిత్య పూలమాలలు వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. తెలంగాణవాదమే శ్వాసగా, ఉద్యమమే ఊపిరిగా జీవించారని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని కొనియాడారు. వెనుకబడిన తరగతుల అభివద్ధి శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ భవనంలో కొండా లక్ష్మణ్ చిత్రపటానికి జిల్లా వెనుకబడిన తరగతుల అభివద్ధి అధికారి లక్ష్మన్ పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. విద్యాశాఖ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ చిత్రపటానికి డీసీఈబీ కార్యదర్శి విజయమ్మ, క్వాలిటీ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళ్లర్పించి ప్రసంగించారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చెన్న విజరుకుమార్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు నివాళ్లర్పించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు నివాళ్లర్పించారు. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలోని పద్మశాలీ భవన్లో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు డీపీ జనార్ధన్ అధ్యక్షతన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు చిందం రాజమల్లు, బాసాని రామ్మూర్తి, కొండి సదానందం, కందగట్ల సారయ్య, శ్రీను, భాస్కర్, నారాయణ, సంజీవ్, మధుసుదన్, వేణు, జిల్లా కోశాధికారి చుంచు రమేష్, తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ : కలెక్టరేట్లో కొండా లక్ష్మణ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ శశాంక పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కొండా లక్ష్మణ్ ఆశయాలకు యువత నడుచుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కొమరయ్య, పద్మశాలీ సంఘం ప్రతినిధులు గద్దె రవి, డాక్టర్ పరికిపండ్ల అశోక్, అనుమల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
మల్యాలలో.. : జెన్నారెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవసాయ ఉద్యానవన కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి ఎంపీ మాలోత్ కవిత నివాళ్లర్పించి మాట్లాడగా జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహబూబ్ పాషా, డాక్టర్ సీతామహాలక్ష్మీ, సుధా అర్జున్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మెన్ పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి, యాళ్ల మురళీధర్‌రెడ్డి, లక్ష్మణ్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి : మండలంలోని కాటాపూర్‌లో కొండా లక్ష్మణ్ జయంతి నిర్వహించగా ములుగు జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పాల్గొని పూలమాలలు వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్, ఆత్మ చైర్మెన్ దుర్గం రమణయ్య, సీనియర్ నాయకులు రాజమౌళి, పద్మశాలీ సంఘం మండల అధ్యక్షుడు పల్నాటి సత్యం, కాటాపూర్ సర్పంచ్ పుల్లూరు గౌరమ్మ, బీరెల్లి సర్పంచ్ జాజ చంద్రం, టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షురాలు ముండ్రాతి రాజశ్రీ, కాటాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రంగు సత్యనారాయణ, పద్మశాలీ సంఘం గ్రామ కమిటీ అధ్యక్షుడు కుసుమ వెంకటేశ్వర్లు, నాయకులు మద్దూరి ఆదినారాయణ, కాయితి బ్రహ్మచారి (శ్రీను), తదితరులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం టౌన్ : ఐటీడీఏ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఏపీఓ (జనరల్) వసంతరావు పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏఓ దామోదర స్వామి, ఎస్ఓ రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : డివిజన్ కేంద్రంలోని ఎల్వైఆర్ రోడ్డులో శ్రీ మార్కండేయ యువజన సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు కందగట్ల సోమశేఖర్, వనం మోహన్, మార్కండేయ యువజన సంఘం అధ్యక్షుడు కూరపాటి జగన్ మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మెన్ జినుగు సురేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమాగాని వెంకటేశ్వర్లు, కోశాధికారి ఆడెపు స్వామి, ఉపాధ్యక్షుడు చిలకమారి భాస్కర్, హరికష్ణ, సహాయ కార్యదర్శి బైరి సతీష్, సాంస్కతిక కార్యదర్శి పారివల్లి శ్రావణ్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చిన్నగూడూరు : ఎంపీడీఓ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించగా ఎంపీపీ వల్లూరి పద్మ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సరస్వతి, వైస్ ఎంపీపీ వీరయ్య, సర్పంచ్ల ఫోరమ్ మండల అధ్యక్షుడు మల్లయ్య, సీనియర్ అసిస్టెంట్ జ్ఞానేశ్వర్, ఎంపీఓ శ్రీనివాస్, మధు, అజీమ్ పాల్గొన్నారు.
గోవిందరావుపేట : గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ లావుడ్య లక్ష్మీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అల్లంనేని హన్మంతరావు, పంచాయతీ కార్యదర్శి గాదె సుమలత, జూనియర్ సహాయకులు రంజిత్‌కుమార్, 9వ వార్డు సభ్యులు మహ్మద్ అన్వర్, లావుడ్య జోగ, తదితరులు పాల్గొన్నారు.
గార్ల : కొండా లక్ష్మణ్ నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి, ప్రత్యేక రాష్త్ర సాధన కోసం కృషి చేసిన తొలితరం ఉద్యమకారుడని, బడుగుల ఆశాజ్యోతి అని సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్, తహసీల్దార్ స్వాతి బిందు, ఎంపీడీఓ రవీందర్రావు, విద్యుత్ శాఖ ఏఈ కుమారస్వామి, పద్మశాలీ సంఘం మండల అధ్యక్షుడు అలవాల రామకృష్ణ అన్నారు. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి నిర్వహించారు. లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు ఉత్తరయ్య, నర్సయ్య, హుస్సేన్, మాజీ ఎంపీటీసీ ధార్న ముత్తయ్య, వీరభద్రం, శ్రీను, సత్యనారాయణ, మోహన్‌రావు, నాగేశ్వర్రావు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.