Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ఇన్చార్జి ఆర్జెసి కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, నగర మేయర్ నీరజ, మార్కెట్ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చింతా నిప్పు కృష్ణ చైతన్య హాజరై కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కమర్తపు మురళి, మహిళా విభాగం అధ్యక్షురాలు తన్నీరు శోభారాణి, మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్, బీసీ సెల్ అధ్యక్షుడు మేకల సుగుణ రావు, నగర ఉపాధ్యక్షులు జక్కుల లక్ష్మయ్య, సుడా డైరెక్టర్ ముక్తార్, జిల్లా దిశా డైరెక్టర్ మరియు డివిజన్ అధ్యక్షురాలు మేదరమెట్ల స్వరూపరాణి, ఎంబీసీ అధ్యక్షురాలు షకీనా, నగర ఉపాధ్యక్ష,కార్యదర్శులు , యువజన విభాగం టూ టౌన్ అధ్యక్షులు బలుసు మురళి కృష్ణ,వివిధ విభాగాల డివిజన్ అధ్యక్ష ,కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్ : మండల పరిధిలో జలగంనగర్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఎంపీపీ బెల్లం ఉమ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి.శ్రీనివాసరావు, ఎంపీడీవో కార్యాలయ సూపర్డెంట్ సుధాకర్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాసరావు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు...
నవాతెలంగాణ-అశ్వాపురం
మండలంలో సోమవారం కొండా లక్మాంబాపూజి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముత్తినేని సుజాత ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ ఎండి షరీఫ్, ఎంపీటీసీ కమటం నరేష్, మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఎంపీవో శ్రీనివాసరావు, యూడిసి పద్మావతి, ఊసా అనిల్ కుమార్, వలబోజు మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడులో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
బూర్గంపాడు : తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి,ప్రముఖ తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులు,నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త,బలహీనవర్గాల స్ఫూర్తి ప్రధాత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బూర్గంపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బూర్గంపాడు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎన్.వివేక్ రామ్,ఎంపీఓ ఎస్.సునీల్ కుమార్,సూపరింటెండెంట్ రవీంద్రబాబు,సీనియర్ అసిస్టెంట్ రఘుకుమార్,జూనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మి,టైపిస్టు మాధవి,ఓఎస్ లు మౌలాలి,లక్ష్మీ నర్సు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బీటీపీఎస్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
మణుగూరు : బీటీపిఎస్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకులు బీటీపిఎస్ సిఈ బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గొప్ప ప్రజాస్వామికవాది అని సిఈ బాలరాజు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీటీపిఎస్ అధికారులు,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
వేంసూరు : తెలంగాణ సాయుధ పోరాటంలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించారు రాజకీయాలకి వన్నెతెచ్చిన నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అనిఅన్నారు మంగళవారం స్థానిక
మండల పరిషత్ కార్యాలయం నందు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు. ఎంపీడీవో వీరేశం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్డి రంజిత్ కుమార్, ఎంఈఓ సిహెచ్ వెంకటేశ్వరరావు, వ్యవసాయ అధికారి రాంమోహన్, ఏపీఓ కోటేశ్వరరావు, ఎంపీటీసీ నాయుడు వెంకటేశ్వరరావు, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.