Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగరానికి చెందిన మోడల్ మహమ్మద్ ఫర్హాను వరల్డ్ హ్యుమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ గౌరవ డాక్టరేట్ తో సోమవారం సత్కరించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఫర్హా మాట్లాడుతూ ఈ నెల 26న ఢిల్లీలోని ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో మహిళా సాధికారతకు తనకు ఈ గౌరవం లభించిందని ఆమె తెలిపారు. తనకు డబ్ల్యూహెచ్ఐర్ ఆర్పిసి అంతర్జాతీయ గౌరవ సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో ఫర్హా మిస్సెస్ ఇండియా మొదటి రన్నర్ గా నిలిచారు. తనకు దక్కిన ఈ గౌరవానికి ఫర్హా సంతోషం వ్యక్తం చేసారు. మహిళా సాధికారత కోసం తను ఎల్లప్పుడూ కషి చేస్తానని ఈ సందర్బంగా ఫర్హా తెలిపారు.అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వున్న డబ్ల్యూఎచ్ ఆర్పిసి గౌరవ డాక్టరేట్ ను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించిందని ఫర్హా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కర్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి దేశారు,జ్యోతిక కాల్రా , ప్రొఫెసర్ డి.పి.మిశ్రా , గోవా మాజీ ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్కో సార్డిన్హా , డబ్ల్యూఎచ్ ఆర్పిసి అంతర్జాతీయ డైరక్టర్ డా.అభిన్న హౌటా, అంతర్జాతీయ కార్యదర్శి మాక్సిమ్ సెంగియుంవా , అంతర్జాతీయ చైర్మన్ తపన్ కుమార్ రౌతారే ల సమక్షంలో జరిగిందని ఫర్హా తెలిపారు .