Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రముఖ సినీ దర్శకులు ఆర్.నారాయణ మూర్తి
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి దేశ రైతాంగాన్ని కాపాడాలని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల ఇతివృత్తంతో నిర్మించిన 'రైతన్న' చలన చిత్రం రూపొందించినట్లు ప్రముఖ దర్శకులు, నటులు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా సీపీఐ(ఎం) కార్యాలయం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, విద్యుత్తు, కార్మిక చట్టాలు వలన కార్మికులు, కర్షకులు, ప్రజలు ఏవిధంగా నష్టపోతారో వివరించారు. అక్టోబర్ 2వ తేదీన విడుదల కానున్న రైతన్న చిత్రంను ప్రజలు ఆదరించి బ్రహ్మరథం పట్టాలని కోరారు. భారతదేశంలో 70 శాతం రైతులు ఉండేవారని, నేడు కార్పొరేటర్ శక్తుల వనల 50 శాతానికి తగ్గిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, సిఐటియూ రాష్ట్ర కార్యదర్శి మంద నరసింహారావు, కొండపల్లి శ్రీధర్, భూక్యా రమేష్, లిక్కి బాలరాజు, విజయగిరి శ్రీనివాస్, మహ్మద్ జలాల్ తదితరులు పాల్గొన్నారు.