Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ లోతట్టు ప్రాంతాలలో ఇండ్లల్లోకి చేరిన నీరు
నవతెలంగాణ-మణుగూరు
గులాబ్ తుఫాన్ కారణంగా మణుగూరు సబ్డివిజన్లో ఆదివారం రాత్రి నుండి కుండపోత వర్షం కురుస్తుంది. దీని కారణంగా సింగరేణిలో మూడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీని కారణంగా ఓబిలలో విపరీతంగా నీరు చేరుతుంది. నీరు తొలగించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. మణుగూరు లోతట్టు ప్రాంతాలో సమితిసింగారం, సుందరయ్యనగర్, అదర్శ్నగర్, ఐలమ్మనగర్ తదితర ప్రాంతాలలో భారీగా వరద నీరు చేరింది. దమ్మక్కపేట పంచాయతీలో మడి లక్ష్మీ ఇంట్లోకి భారీగా వరద నీరు చేరింది. అనేక నివాస ప్రాంతాలలోకి నీరు చేరుతుంది. భద్రాద్రి థర్మల్ వపర్ ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.