Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
అక్టోబరు నెల ఒకటో తారీఖున జరగనున్న సిపిఎం మండల 8వ మహాసభకు పార్టీ సభ్యులు సకాలంలో హాజరై జయప్రదం చేయాలని పార్టీ మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య కోరారు. రామిశెట్టి పుల్లయ్య భవనంలో జరిగిన మండల కమిటీ సమావేశానికి కోటి సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు సర్దార్ జమలాపురం కేశవరావు మెమోరియల్ కళాశాలలో మండల మహాసభ నిర్వహించబడుతుందని, ఈ సభకు నాయకులు పోతినేని సుదర్శన్రావు, పొన్నం వెంకటేశ్వరరావు, మాదినేని రమేష్, చింతలచెరువు కోటేశ్వరరావులు హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎర్రమల శ్రీనివాసరెడ్డి, గొల్లపూడి కోటేశ్వరరావు, సగుర్తి సంజీవరావు, జార్జి టెన్నిసన్, షేక్ లాలా, గామాసు జోగయ్య, నాగులవంచ వెంకట్రామయ్య, నల్లబోతుల హను మంతరావు, అనుమోలు వెంకటేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, శంకర్రావు పాల్గొన్నారు.