Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి(కెవిపిఎస్) ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 126వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని నాయుడు పేట గ్రామంలో జాషువా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా కెవిపిఎస్ ఖమ్మంరూరల్ మండల అధ్యక్ష, కార్యదర్శులు కుక్కల సైదులు, పాపిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలోని అంటరాని తనంపై, మూఢాచారాలపై తిరగబడ్డ కవి జాషువా అన్నారు. నేటి యువత జాషువా చూపిన మార్గంలో నడవాలన్నారు. కార్యక్రమంలో కెవిపిఎస్ మండల నాయకులు ఏపూరి వరకుమార్, తోళ్ల యేసు, మహంకాళి నవీన్, గోపాల్, మల్లయ్య, రామనాధం తదితరులు పాల్గొన్నారు.