Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలలో మంగళవారం డిప్యూటీ జిల్లా వైద్యాధికారి వినోద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుభాష్ నగర్ సెంటర్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ బోర్డు పెట్టి స్థాయికి మించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ఆర్ఎంపి వైద్యుడికి నోటీసులు ఇచ్చి సీజ్ చేశారు. గోవిందు సెంటర్లోని పర్మిషన్ లేకుండా నడుపుతున్న మన వైద్యశాలను సీజ్ చేశారు. రైల్వే బ్రిడ్జి వద్ద ఒక ఆయుర్వేద వైద్యుడు ఆర్.ఎం.పి వైద్యం చేస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ తనిఖీలో ఒకసారి హెచ్చరించామని మూడోసారి ఇలాగే చేస్తే వైద్యశాలను సీజ్ చేస్తామని డిప్యూటీ జిల్లా వైద్యాధికారి వినోద్ హెచ్చరించారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని బోర్డులు పెడుతూ అందులోనే అనుమతులు లేని ల్యాబులు నిర్వహిస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీజ్ చేశారు. పాత బస్టాండ్ సమీపంలోని ఓ గల్లీలోని ల్యాబ్స్ లో వైద్య చికిత్స చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. అనుమతులు లేకుండా వైద్యశాలలు ల్యాబులు, స్థాయికి మించి వైద్యం చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడవద్దని అన్నారు.
ప్రభుత్వ వైద్యశాల పనితీరు భేష్
అనంతరం 30 పడకల ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. రికార్డులు తనిఖీ చేసి వైద్యశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 83 శాతం వ్యాక్సీన్,
28 రోజుల్లోనే 33 సాధారణ డెలివరీలు చేయటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. డిప్యూటీ జిల్లా వైద్యాధికారి వెంట ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ఇంచార్జి డాక్టర్ సతీష్ ఉన్నారు.