Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఘన స్వాగతం పలికిన రోటరీ క్లబ్ సభ్యులు
నవతెలంగాణ-ఖమ్మం
బంగ్లాదేశ్ - పాకిస్తాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో అసువులు బాపిన వీర జవాన్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చేపట్టిన ఆర్మీ జవాన్ల సైకిల్ యాత్ర మంగళవారం ఖమ్మం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా వారికి రోటరీ క్లబ్ అఫ్ ఖమ్మం అధ్యక్షులు పాలడుగు నాగేశ్వర రావు, కార్యదర్శి నల్లమోతు రవీంద్రనాథ్, రోటరీ ట్రస్ట్ నుండి మల్లాది వాసుదేవ్, దొడ్డపునేని సాంబశివరావు, కాళ్ల పాపారావు, ఐ.రామకృష్ణ, ఐతం రవీంద్ర, బి.కే. రావు, వంగల జగన్నాధం, పాషా, ఇన్నర్ వీల్ తరుపున ఝాన్సీలక్ష్మి తదితరులు ఘనస్వాగతం పలికి స్థానిక బడ్జెట్ హోటల్ లో అల్పాహారం ఏర్పాటు చేసి తదనంతరం వరంగల్, భువనగిరి మీదుగా హైదరాబాద్కు చేరుకుంటారని తెలిపారు.
సెప్టెంబర్ 20న లెఫ్ట్నెంట్ జనరల్ ఏ.అరుణ్ కుమార్, ఏవోసీ క్యాంపు సికింద్రాబాద్లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సైకిల్ యాత్ర ద్వారా సైనికులలో మనోధైర్యం, ఆత్మస్థైర్యము నింపడంతో అమరులైన జవాన్ల ఆత్మాకు శాంతి కలగాలని ఈ యాత్రను చేపట్టారని తెలిపారు. ఈ సైకిల్ యాత్రలో లెఫ్ట్ నెంట్ కల్నల్ లక్ష్మణ్ సింగ్ తో పాటు సబ్ మేజర్ విజరు సింగ్, అంకుర్ రావత్, హవల్దార్ మహేతో, నాయక్ ఆసీస్ రారు, పోలిశెట్టి నాగరాజు, సింగ్, సచిన్ కుమార్, యాగాస్ పటేల్, జేమ్స్, బ్రిజ్మోహన్, విశాల శర్మ, సాకేత్ శర్మ, తేజస్, వీజీ తదితరులు ఆర్మీ నుండి పాల్గొన్నారు.