Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
భారీ వర్షాల కారణంగా జలమయమైన పల్లిపాడు లోని రెండు పడక గదుల గృహాలను ట్రైనీ కలెక్టర్ బి.రాహుల్, ఆర్డీవో రవీంద్రనాథ్ మంగళవారం పరిశీలించారు. లోతట్టు వాసుల సమస్య శాశ్వత పరిష్కారంలో భాగంగా స్థానికంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జలమయమైన ఇళ్ల పరిసరాలను పరిశీలించిన వారు .. పిల్ల కాలువల ఏర్పాటు ద్వారా నీటిని పక్కనే ఉన్న చెరువుకు తరలించాలని, వైరా మున్సిపాలిటీ నిధుల నుండి మరమ్మతులు చేపట్టేందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తహసీల్దార్ కృష్ణకు సూచించారు. ప్రతి ఇంటి ముందు మట్టి పోయాలని, నీటి మళ్లింపుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నాగేశ్వరరావు, సర్వేయర్ సతీష్‌రెడ్డి, వీఆర్వో శాంతయ్య తదితరులు ఉన్నారు.