Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తుఫాన్ నేపథ్యంలో కిన్నెరసానిలో లెవెల్ బ్రిడ్జీ పరిశీలన
అ బృహత్ పల్లె ప్రకృతి వనం పనులపై అసంతృప్తి
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండల వ్యాప్తంగా సోమవారం కురిసిన వర్షాలకు రాయిపాడు గ్రామ సమీపంలో గల కిన్నెరసాని నదిపై ఉన్నలో లెవెల్ బ్రిడ్జీ పైనుంచి వరద ఉధృతంగా ప్రవహించడంతో బారికేడ్ చేయబడిన నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ అనుదీప్ సందర్శించి, పరిశీలించారు. అనంతరం ప్రయాణం చేయుటకు అవకాశం కల్పించాలని చెప్పారు. మండల కేంద్రం శివారులోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి, ఒక అడుగు ఎత్తు మొక్కలు నాటరని, మొక్కల పెంపకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల కేంద్రములో భగత్ సింగ్ సెంటర్ నుంచి సుమారు ఒక కిలో మీటర్ మేర సీసీ రోడ్డు మంజూరు చేయాలని స్థానికులు ఫిర్యాదు మేరకు కలెక్టర్ జీఎస్ బీ రోడ్డు మంజూరు కోసం అంచనా వ్యయం వివరాలు సత్వరమే ఇవ్వాలని పంచాయతీ రాజ్ శాఖ ఏఈని ఆదేశించారు. మర్కోడు పీహెచ్సీ సబ్ సెంటర్ నుంచి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాక్సిన్ టీకాలు ఆన్లైన్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతున్నట్టు గమనించి ఏఎన్ఎంతో పాటు వ్యాక్సిన్ టీకాల వివరాలు రాయడానికి, ఆన్లైన్ చేయడానికి మరో ఇద్దరిని ఉంచాలని అధికారులకు సూచించారు. టీకాలు వేయడానికి అవసరమైతే 400 వ్యాక్సిన్ డోసులు ఏర్పాటు చేపిస్తానని చెప్పారు. మర్కోడు గ్రామ పంచాయతీలో అవెన్యూ ప్లాంటేషన్ పనులు బాగున్నాయని సెక్రటరీ నాగరాజును అభినందించారు. డంపింగ్ యార్డ్ సిబ్బంది సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. తడి పొడి చెత్తపై వారి అవగాహనను పరీక్షించారు. డంపింగ్ యార్డ్ సిబ్బంది జీతాలు రూ.8500లకు పెంచే చర్యలు తీసుకుంటానని అన్నారు. వైకుంఠ ధామాలను ప్రజలు వినియోగిస్తున్నారా? లేదా అధికారులను అడిగితెలుసుకున్నారు. లేదని తెలపటంతో అవి అలంకార ప్రాయంగా ఏర్పాటు చేసినవి కావని, వైకుంఠ ధామాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా స్థానిక అధికారులు ప్రజా, ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో అన్ని రికార్డులను పరిశీలించారు. ఆళ్ళపల్లి, లక్ష్మీపురం గ్రామస్తుల వినతి పత్రాలను తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీసీ సుమంత్, స్థానిక జెడ్పీటీసీ కొమరం హనుమంతు, ఎంపీఓ శివ, తహసీల్దార్ మొహమ్మద్ సాదియా సుల్తానా, ఎంపీడీవో మంగమ్మ, ఏపీఓ రఘునాథ్, గిర్దావర్ శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.