Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
జాతీయ స్ధాయి అండర్-17 కబడ్డీ పోటీలకు కారేపల్లి యువకుడు గడ్డం దిలీప్‌కుమార్ ఎంపికైనాడు. ఈనెల 18న వరంగల్‌లో జరిగిన అండర్-19 కబడ్డీ ఎంపిక పోటీల్లో దిలీఫ్ కుమార్ ప్రతిభ కనపర్చాడు. అక్టోబర్ 1న డిల్లీలో జరిగే జాతీయ స్ధాయి కబడ్డీ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరుపున ప్రాతినిధ్యం వహించనున్నారు. కారేపల్లికి చెందిన గడ్డం దిలీఫ్ 2019 నవంబర్‌లో నేపాల్ లోని పొక్రాన్లో జరిగిన ఐదు దేశాల స్ధాయి అంతర్జాతీయ కబడ్డీ పోటీలో భారత్ తరుపున ప్రాధినిధ్యం వహించి ప్రతిభ కనపర్చాడు. నిరుపేద కుటుంబంలో పుట్టిన గడ్డం దిలీఫ్‌కుమార్ చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తూ సత్తాచాటుతున్నాడు. తల్లి దండ్రులు గడ్డం కోటేశ్వరరావు-లక్ష్మి దంపతులు కారేపల్లిలో ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తూ కుమారుడిని ఉన్నత స్ధాయికి ఎదిగేలా తీర్చిదిద్దారు. అంతర్జాతీయ కబడ్డీలో సత్తాచాటిన దిలీఫ్కుమార్ను పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందనలతో ముంచ్చెత్తారు.