Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యాస్పిరేషనల్ నివేదికలు అందచేయాలి
అ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆకాంక్ష నివేదికలు అప్లోడ్ చేయుటలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, యాస్పిరేషనల్ నివేదికలు అందజేయాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో విద్య, వైద్య, మహిళా శిశు సంక్షేమ, రహాదారులు, భవనాల శాఖ, డిఆర్డిఓ, వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పశుసంవర్ధక, మార్కెటింగ్, అధికారులతో యాస్పిరేషనల్ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించి, మాట్లాడారు. అక్టోబర్ 10వ తేదీ వరకు యాస్పిరేషనల్ నివేదికలు అందచేయాలని ఆదేశించారు. యాస్పిరేషన్ పోర్టల్లో డాటా ఎంట్రీ సక్రమంగా జరగడం లేదని, ప్రతి నెలా అప్లోడ్ చేస్తున్న ఇండికేటర్లు సమగ్ర పరిశీలన తదుపరి మాత్ర మే అప్లోడ్ చేయాలని అధికారుల ను ఆదేశించారు. గిరిజనులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, విద్య, వైద్య రంగాల్లో వెనుకంజలో ఉన్న జిల్లాలను అభివృద్ది చేసేందుకు మన జిల్లాను యాస్పిరేషనల్ ప్రకటించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 726 జిల్లాలకు గాను 112 జిల్లాలను మాత్రమే ఆకాంక్షిత జిల్లాలుగా నీతి అయోగ్ ప్రకటించినట్లు తెలిపారు. జిల్లాలోని 479 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు 329 గ్రామ పంచాయతీల్లో కామన్ సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన గ్రామ పంచాయతీల్లోను అక్టోబర్ 25వ తేదీ నాటికి కామన్ సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేసి నివేదికలు అందచేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి అన్ని పాఠశాలల్లో మంచినీరు సరఫరా చేయాలని ఆదేశించిన ప్పటికీ ఇంకనూ 45 పాఠశాలలకు ఎందుకు కనెక్షన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో డిఆర్ఓ అశోక చక్రవర్తి, డిఆర్ఓ మధుసూ దన్ రాజు, సంక్షేమ అధికారి వరలక్ష్మి, వైద్యాధికారి శిరీష, ఆర్అండ్బి ఈఈ భీమ్లా, ఎల్డీయం శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, ఇరిగేషన్ అధికారి అర్జున్, సహాకార అధికారి వెంకటేశ్వర్లు, సిపిఓ యుఎస్ రావు, పశుసంవర్ధక శాఖ ఏడి పురంధర పాల్గొన్నారు.