Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానమని డీఎస్పీ వెంకటేశ్వరబాబు అన్నారు. మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామం పంచాయతీలో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు సహకారం ఎంతో సంతోషం అని మండలంలోని అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో సర్క్యుల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, సర్పంచ్ తిరుపతియ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.