Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆలయ ధర్మకర్త మచ్చా శ్రీనివాసరావు
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచలోని గోవర్ధనగిరి కాలనీ, చింతలచెర్వు కట్టకింద ఎంతో చరిత్ర కలిగిన శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయంను శ్రీశ్రీశ్రీ జగదుర్ధరు శంకరాచార్య, శ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠానికి అనుసంధానం చేస్తున్నట్టు ఆత్మలింగేశ్వరాలయ ధర్మకర్త మచ్చా శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఈ మేరకు ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దేవాలయం అనుసం ధానం చేయడం ద్వారా భవిష్యత్తు కార్యక్రమాలు ఆ పీఠం సూచన, అనుమతులు పొందడం ద్వారా ఇక్కడ జరుగు అభివృద్ధి పనులు పూజాధి కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆయన స్థానిక ప్రజలకు భక్తులకు తెలియజేశారు. సుమారు 13వ శతాబ్ధంలో కాకతీయ రాజులు పరిపాలనలో శ్రీశ్రీ ప్రతాపరుద్రుడి కాలమానంలో పాల్వంచ సంస్థానా ధీశుల పాలనలో ఆత్మలింగేశ్వర ఆలయం దేదీప్యమా నంగా పూజలందుకున్న మాట వాస్తవమమని చరిత్రకారులు అనేక సందర్భాలలో తెలిపారని అన్నారు. ఈ ఆయన ప్రత్యేకత మహాశివరాత్రి పర్వదినాన ఉదయం సూర్యుడు ఉదయించగానే తొలికిరణాలు శిశలింగంలో ప్రచురిస్తాయని ఇలా పడడం తెలంగాణ రాష్ట్రంలో ఏకైర శివాలయం ఆత్మలింగేశ్వరాలయం అని చెప్పారు. అలాంటి మహౌన్నతమైన శివాలయం శిధిలమై మట్టిలో కలిసిపోయి చెట్లకుప్పల్లో చింతలచెర్వు కట్టకు చట్టడివిలాంటి మొగిలి మొదల్లలో ఉన్నదేవాలయా న్ని ఆనాడు నా ఆధ్వర్యంలో ఆత్మలింగేశ్వర సేవాస మితిగా ఒక భక్త బృందం స్వచ్చంధ సేవాసం సఘంగా ఏర్పడి దేవాలయ అభివృద్ధి కొరకు 2001 నుండి నేటి వరకు వినాయక నవరాత్రుల అమ్మవారి నవరాత్రులు, బతుకమకమ ఉత్సవాల, శ్రావణ, కార్తీకమాన ఉత్సవాలు, మహాశివరాత్రి, ఉగాది, దసరా, అనేక పూజా కార్యక్రమా లు నిర్వహించి అభివృద్ధి చేశామని చెప్పారు. చరిత్ర కలిగిన ఈ దేవాలయ ంలో భవిష్యత్తు పాలనలో జీర్ణీర్దారణ కార్యక్రమం పున:ప్రతిష్ట అతి పవిత్రంగా నిర్వహిం చాలని వీటితోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. 800 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులచే నిర్మితమై ఈనాడు స్థానికులం దరి సహాయ సహకారాలు చేయడం వల్ల అభివృద్ధి చెందిందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇంతే పవిత్రతను ప్రదర్శిస్తూ ఈ దేవాలయంలో పూజలు అభిషేకాలు హౌమాలు నిర్వహించుటకు ఆ దేవాలయ సేవా సమితి సమావేశం నిర్వహించుకుని ఏకగ్రీవ తీర్మాణం ద్వారా పీఠానికి అను సంధానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకర్ల సమా వేశంలో ఎల్లావులకోటేశ్వరరావు, మచ్చా నాగార్జున, నిమ్మగడ్డ రమణ, కృష్ణ, జి.వెంకటేశ్వరరావు, ఈశ్వరయ్య, యాలా వుల వెంకన్న, వీరమా చినేని నరేష్, వల్లపు యాకయ్య, సాంబయ్య, నరేగా రమేష్ తదితరులు పాల్గొన్నారు.