Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రోడ్ల దిగ్బంధనానికి వ్యకాస మద్దతు
అ జిల్లా ప్రధాన కార్యదర్శి
మచ్చా వెంకటేశ్వర్లు పిలుపు
నవతెలంగాణ-కొత్తగూడెం
పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ అక్టోబర్ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 400 కిలోమీటర్ల పరిధిలో జరుగు రాస్తారోకోలో పోడు సాగుదారులు వేలాదిగా పాల్గొనాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. గురువారం సంఘం కార్యాలయంలో జరిగిన సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రజా సమస్యలపై ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం ప్రజలకు అందుబాటులో లేదని ప్రభుత్వ వైద్యశాలలను మెరుగు పరచాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్న ప్రతి పేద ప్రజలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు జాటోత్ కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, జిల్లా సహాయ కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, బత్తుల వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు బి.చిరంజీవి, పిల్లి నాయుడు, ఎస్కె అబీదా, నాగమణి, శ్యామల, వెంకటేశ్వర్లు, బీరం శ్రీను, ఈసం నరసింహారావు, డి.రాందాస,్ రాము, చంటి, జి.భాస్కర్, వసంత, ఎస్.నాగేశ్వరరావు, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : గిరిజన పోడు సాగుదారులకు హక్కులు కల్పించాలని కోరుతూ ఈ నెల 5వ తేదీన చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బందానికి పోడు సాగు దారులు వేలాదిగా తరలి రావాలని టిఏజిఎస్ జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం సడక్ బంద్ విజవంతం కోరుతూ మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో జరిగిన జనరల్ బాడీ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశాలలో భీమయ్య, రమేష్, నంద, సోమయ్య తదితరులుపాల్గొన్నారు. శ్వారావుపేట : అఖిలపక్షం ఆధ్వర్యంలో తలపెట్టిన రాస్తారోకోను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీపీఐ రామక్రిష్ణ, సీపీఐ(ఎం) పుల్లయ్య, ఎన్డీ ప్రభాకర్, కాంగ్రెస్ చెన్నకేశవరావులు పాల్గొన్నారు.