Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ ధర్నాలో గిరిజన సంక్షేమ
శాఖ అధికారుల హామీ
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ నందు పనిచేస్తున్న డైలీవేజ్, అవుట్సోర్సింగ్ కార్మికులకు లాక్డౌన్ కాలానికి పూర్తి వేతనాలు చెల్లిస్తామని, గిరిజన సంక్షేమ శాఖ అదనపు కమిషనర్ సైదా, డిప్యూటీ డైరెక్టర్ ప్రియాంకలు హామీ ఇచ్చారు. సీఐటీయూ ఆధ్వర్యంలో డైలీవేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు గురువారం చేపట్టిన ధర్నాలో ఈ హామీ ఇచ్చారు. లాక్ డౌన్ కాలానికి వేతనాలు ఇవ్వాలని, పాఠశాలలు ప్రారంభించి అందరినీ విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్ల పరిష్కారం కోసం వివిధ జిల్లాల నుండి హాజరైన కార్మికులు 'సంక్షేమ భవన్' గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 2020 ఏప్రిల్ నుండి లాక్డౌన్ విధించిన ప్రభుత్వం అప్పటినుండి కార్మికులకు వేతనాలు చెల్లించలేదని ధర్నా చేపట్టారు. ఈ ధర్నానుద్దేశించి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ మాట్లాడారు. లాక్డౌన్ కాలానికి అందరికీ వేతనాలు ఇస్తామని ఓ నెం.02లు ఇచ్చిన ప్రభుత్వం వాటిని ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని పోరాటాల ద్వారానే లొంగదీస్తామని తెలిపారు. డైలీ వేజ్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి.మధు మాట్లాడుతూ ఇటీవల ఇచ్చిన బడ్జెట్ను లాక్డౌన్ కాలపు వేతనాలు చెల్లింపుకు మాత్రమే వినియోగించాలని, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. దసరా పండుగలోపు లాక్ డౌన్ కాల పు వేతనాలు చెల్లింపు ఇతర సమ స్యల పరిష్కారానికి చర్యలు తీసుకోక పోతే కార్మికులు కుటుంబ సభ్యులతో నే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. 18 రకాల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందించారు. కమిష నర్ సూచన మేరకు ధర్నా వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించిన అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.బ్రహ్మచారి, అధ్యక్షులు ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్, నాయకులు హీరాలాల్ రాములు, రవి, రాజేందర్, సారక్క, నాయక్, నందులాల్, అనిత, కౌశల్య, వీరన్న, అనంతరాములు, పద్మ తదితరులు పాల్గొన్నారు.