Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ చేపడుతున్న దశలవారి ఆందోళనా కార్యక్రమాల్లో భాగంగా అక్టోబర్ 5 ఆదిలాబాద్ నుంచి అశ్వారావు పేట వరకు 5 వందల కిలోమీటర్ల మేర రోడ్లను దిగ్భందించి రవాణా వ్యవస్థను స్థంభింపచేస్తామని, పోడు రైతాంగానికి మద్దతుగా జరుగుతున్న ఈ దిగ్భందం కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, న్యూడెమోక్రసీ పార్టీల నేతలు కోరారు. సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో గురువారం జరిగిన ఉమ్మడి సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకులు నాగా సీతారాములు, న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు, న్యూడెమోక్రసి నాయకులు ముద్దా భిక్షం, ఎల్.విశ్వనాధం మాట్లాడారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల పోడు సమస్య రోజు రోజుకు జఠిలం అవుతుందన్నారు. ఫారెస్టు అధికారులను పోడు భూములపైకి ఉసిగొల్పుతూ పేదలపై దాడులకు పూనుకుంటున్నారని విమర్శించారు. దాడులు, నిర్బందాలు, పంటల ద్వంసంతో పోడు క్షేత్రాలను రణరంగంగా మారుస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. అనంతరం ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందించారు. నూతన సాగు చట్టాల రద్దు, ఇందన, నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయాలని, పోడు సమస్య పరిష్కారం, కార్మిక చట్టాల సవరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తదితర సమ స్యలపై19 జాతీయ, రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా కలెక్టర్‌కు వినతి పత్రం అందించామని నేతలు తెలిపారు. సీపీఐ జిల్లా నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు శేఖర్, కాలం నాగభూషణం, ఎన్డీ నాయకులు సత్యం, కె.సురేందర్, సతీష్, నిర్మల, ఉక్లా పాల్గొన్నారు.