Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల పరిధిలోని సోంపల్లి గ్రామానికి చెందిన బోరెం ముత్తయ్య, బోరెం శ్రీనులకు చెందిన మేకలు పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. గురువారం ఈ ఇరువురు వ్యక్తులు గ్రామ శివారులోని కిన్నెరసాని వాగు ఒడ్డుకు తమ మేకలను మేతకు తోలుకొని వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో మేకలకు సమీపంలో పిడుగు పడి ఇరువురు వ్యక్తులకు చెందిన 8 మేకలు మృతి చెందాయి. సమాచారం తెలుసుకున్న మండల పశువైద్యాధికారి రవీందర్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.