Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అభినంధించిన తహసీల్దార్, పాఠశాల కరస్పాంటెండెంట్ కృష్ణప్రసాద్
నవతెలంగాణ-జూలూరుపాడు
మండల కేంద్రంలోని సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థి పాలేరులోని జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో జూలూరుపాడు మండల వాసి అయిన కొల్లిపాక సురేష్ కుమారుడు కొల్లిపాక హర్షవర్ధన్ జోహార్ సీటు సాధించాడు. ఈ సందర్భంగా తహసీల్దార్ లుధర్ విల్సన్ విద్యార్థి హర్షవర్ధన్‌ను అభినందించారు. మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ప్రోత్సహించారు. అదేవిధంగా సాయి ఎక్సలెంట్ స్కూల్ కరస్పాండెంట్ అరెబోయిన కృష్ణ ప్రసాద్ విద్యార్థి హర్షవర్ధన్‌ను అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గురుకుల, నవోదయ విద్యాలయాలకు, సైనిక్ విద్యాలయాలకు, ప్రభుత్వ కార్పొరేట్ పాఠశాలలకు సంబంధించిన పోటీ పరీక్షలకు నాణ్యమైన విద్యను బోధించి ప్రతి పేద విద్యార్థి పోటీ పరీక్షలలో విజయం సాధించే విధంగా సాయి ఎక్సలెంట్ స్కూల్ ముందంజలో ఉంటుందని తెలిపారు. అదేవిధంగా విద్యార్థి తండ్రి కొల్లిపాక సురేష్ మాట్లాడుతూ మా అబ్బాయికి జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు విజయం సాధించే విధంగా అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించిన సాయి ఎక్సలెంట్ స్కూల్ కరస్పాండెంట్ కృష్ణ ప్రసాద్, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.