Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన విద్యార్థుల ఆందోళన
నవతెలంగాణ-చర్ల
చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 13 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు కొత్తగా ఏర్పాటు చేయబోయే ఏకలవ్య పాఠశాలకు కేటాయించడం తెలిసిన కళాశాల విద్యార్థులు స్వచ్ఛందంగా జడ్పీ సర్వసభ్య సమావేశంలో జెడ్పి చైర్ పర్సన్ కోరం కనకయ్యని కలిసి ఆందోళనను తెలియజేసినారు. వారు కనకయ్యతో మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా కళాశాలలో వివిధ గ్రూపులు నడుస్తున్నవి అందులో ముఖ్యంగా సైన్స్‌కు చెందిన బైపిసి గ్రూపు ప్రాక్టికల్స్‌కు వివిధ మొక్కలను, ఔషధ మొక్కలను సదరు స్థలంలో మా ప్రాక్టికల్స్‌కు మొక్కలు పెంచుతున్నామని, ఆ స్థలాన్ని ఏకలవ్య స్కూల్‌కి కేటాయించడం వలన మేము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చర్ల లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయుట ద్వారా పేద గిరిజన ఎస్టీ పిల్లలకి సౌకర్యంగా ఉంటుందని కావున మా కళాశాల స్థలం మా కళాశాలకే ఉండనివ్వాలని విద్యార్థులు కోరారు. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకున్న కనకయ్య విద్యార్థులకు మీ కళాశాల స్థలం మీకే ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల చర్ల విద్యార్థిని విద్యార్థులు, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, టీఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు సోయం రాజా రావు, నక్కీ బోయిన శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.