Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల
నవతెలంగాణ-పాల్వంచ
రైతు సంక్షేమమే లక్ష్యంగా పాల్వంచ సొసైటీ పాలకవర్గం కృషి చేస్తుందని సొసైటీ అధ్యక్షులు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. గురువారం సొసైటీ మహాజన సభను సంఘం కార్యాలయంలో నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన కొత్వాల మాట్లాడుతూ పాల్వంచ సొసైటీ పాలకవర్గం రైతులకు చేస్తున్న సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2018 సంవత్సరంలో పాల్వంచ సొసైటీని రాష్ట్రంలోనే ద్వితీయ ఉత్తమ సొసైటీగా ఎంపిక చేసి రూ.25 వేల నగదు షీల్డు బహూకరించిందని అన్నారు. 2021లో జిల్లా ఉత్తమ సొసైటీ అధ్యక్షులుగా తనను ఎంపిక చేసిందన్నారు. ఇదంతా సొసైటీ పాలకవర్గం సభ్యులు, రైతులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే సాధ్యమయిందన్నారు.
రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి సకాలంలో ఎంఆర్పీ ధరలకే ఎరువులు, సబ్సిడీపై విత్తనాలు, రుణాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం స్వీకరణ చేశామన్నారు. అక్టోబర్ నెలలో రూ.25 వేల రుణమాఫీ అయిన సభ్యులకు తిరిగి రుణాలు ఇవ్వనున్నామన్నారు. వడ్డీ కట్టిన రైతులకు రుణాలు పెంచి ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా అధికారులు ప్రణాళికలు తయారు చేసి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను కొత్వాల కోరారు. ఈ కార్యక్రమంలో లిసొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్, వ్యవసాయశాఖ అధికారి శంభోశంకర్, సహకార సంఘ బ్యాంక్ మేనేజర్ వసుమతి,సొసైటీ డైరెక్టర్లు బుడగం మోహన్ రావు, కనగాల నారాయణరావు, సామ జనార్దన్ రెడ్డి, జరపన సీత రాంబాబు,చాగాని పాపారావు, భూక్య కిషన్, బర్ల వెంకటరమణ, నిమ్మల సువర్ణ, సొసైటీ సీఈవో జీ లక్షీనారాయణ, సురేందర్ రెడ్డి, సొసైటీ సభ్యులు, పాల్గొన్నారు.