Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని టీఆర్యస్ మండల మహిళ కమిటీ తెలిపింది. గురువారం పార్టీ కార్యాలయంలో మండల మహిళా అధ్యక్షురాలు జాస్తి గంగా భారతి అధ్యక్షత వహించి మాట్లాడారు. నూతనంగా ఎన్నుకోబడిన మహిళా కార్యకర్తలను ప్రతి ఒక్కరిని పరిచయం చేశారు. వార్డు సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం చూపేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని నిర్ణయం తీసుకున్నారు. అలాగే బతుకమ్మ సన్నాహాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ప్రబోధ కుమార్, కేజీ ప్రేమ్ కుమార్, మహిళా కార్యదర్శి ములకలపల్లి మదారి లక్ష్మీకాంతం, లక్ష్మీబాయి లక్ష్మీ, పద్మప్రియ, విజయ లక్ష్మి, మహిళా నాయకులు, వార్డు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.