Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
సెప్టెంబరు నెల బొగ్గు ఉత్పత్తి 112 శాతం సాధించిందని, సమిష్టి కృషితో సత్ఫలితాలు సాధిస్తున్న మణుగూరు ఏరియా అధికారులను, కార్మికులను జీఎం జక్కం రమేష్ అభినందించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబరు నెల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 83,8000 లక్షల టన్నులు లక్ష్యం కాగా 854913 లక్షల టన్నులు సాధించి 112 శాతం ఉత్పత్తిలో ముందంజలో ఉందన్నారు. ఉత్పాదకత 5148000 కాగా 62466399 సాధించి 121 శాతం ఉత్పాదకతలో ముందంజలో ఉందన్నారు. ఓబీ వెలికితీత లక్ష్యం 13.05 కాగా 9.70 లక్షల క్యూబిక్ మీటర్లుతో 74 శాతం ఓబీ తీయడం జరిగిందన్నారు. రైల్వే ద్వారా 126 ర్యాక్స్ పంపడం జరిగిందన్నారు. సెప్టెంబరు నెలలో మొత్తం రవాణా 8 లక్షల 49 వేల 886 టన్నులు రవాణా చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ సలగల రముశీఏష్ తదితరులు పాల్గొన్నారు.