Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
మహబూబాబాద్ జిల్లా మాదాపూర్ శివారులో గల అంగన్వాడీ టీచర్ తేజావత్ కమలపై సర్పంచ్ ఇస్లావత్ నరేష్ మరో పదమూడు మందితో కలిసి విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరచడాన్ని ఖండించాలని సీఐటీయూ జిల్లా నాయకులు కొండపల్లి శ్రీధర్, అబ్దుల్ నబీ, మండల కన్వీనర్ వజ్జ సుశీల, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు పాయం సారమ్మ అన్నారు. ఈ విషయమై యూనియన్ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి తహసీల్దార్ రమేష్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జవాజి పద్మ, ధనమ్మ, కళావతి, లక్ష్మి, రాధ, నాగమణి, శారద, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : మహబూబాద్ జిల్లాలో మాదాపురం సర్పంచ్ ఇస్లావత్ నరేష్ అంగన్వాడీ టీచర్ తేజావత్ కమలపై దాడి చేయడం సరికాదన్నారు. సర్పంచ్‌ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలని సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకులగూడెం సర్కిల్, స్టేషన్ బస్తి సెక్టార్ ఇల్లందులో పాడు సర్కిల్లో ప్రదర్శనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఈసం వెంకటమ్మ, ఆలేటి కిరణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఫాతిమా, మరియ, రమని, శకుంతల, సంధ్య, వనజ, దేవేంద్ర, శారద, ఆదిలక్ష్మి, అరుణ మాట్లాడారు.