Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
సాగులో రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి నారెడ్డి సీతారాంరెడ్డి అన్నారు. మండలంలోని పాతర్లపాడు క్లస్టర్ గ్రామాల పరిధిలో రైతులకు గురువారం యాసంగి సీజన్లో వరి పంటకు ప్రత్యామ్నా యంగా మెట్ట పైర్లపై రైతు శిక్షణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏవో మాట్లాడుతూ చీడపీడలపై రైతులకు అవగాహన కల్పించారు. ఒకే పంట కాకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయడం వలన అధిక దిగుబడి వచ్చి రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని తెలిపారు.
ముదిగొండ : పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని మండల వ్యవసాయ అధికారి మందుల రాధ రైతులకు సూచించారు. మండల పరిధిలో పమ్మి, వివికేపురం రైతువేదికలో రైతులకు పంట మార్పిడి విధానంపై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈసదస్సులో పమ్మి గ్రామసర్పంచ్ కొండమీద సువార్త రఘుపతి, ఏఈవోలు లిఖిత, ప్రియాంక, రైతులు పాల్గొన్నారు.