Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ కలెక్టర్ మొగిలి స్నేహలత
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
విలీన పంచాయతీల్లో అక్రమంగా వేసిన వెంచర్ వివరాలను సేకరించి అందజేయాలని ఆడిషనల్ కలెక్టర్ స్నేహలత అధికారులను ఆదేశించారు. పెద్దతండా గ్రామాన్ని ఆడిషనల్ కలెక్టర్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలో నిర్మాణం చేపడుతున్న వైకుంఠదామం నిర్మాణాలను, కంపోస్టు షెడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్నేహలత మాట్లాడారు. వైకుంఠ దామం నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సాయిగణేష్నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వెంచర్లను పరిశీలిం చారు. సుడా, పంచాయతీ అధికారులు కలిసి అక్రమ వెంచర్ల వివరాలను సేకరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీవో వాసిరెడ్డి ప్రభాకర్‌రావు, డీఎల్వో పుల్లారావు, పీఆర్ ఈఈ చంద్రమౌళి, డీఈఈ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీవో బి.శ్రీనివాసరావు, ఎంపీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.