Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
స్థానిక ఎస్పీ ఆఫీస్ రోడ్డులో సుగ్గుల వారి తోట మినీ అంగన్వాడీ కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని నగర మేయర్ పునుకొల్లు నీరజ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. 230 మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో 23 డివిజన్ కార్పొరేటర మగ్బుల్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.