Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రీజినల్ కమిషనర్ రవితేజ
నవతెలంగాణ-కాశిబుగ్గ
ఏదైనా ఒక సంస్థలో, కంపెనీలో 19 మంది కంటే ఎక్కవ మంది పనిచేస్తే వారికీ తప్పనిసరిగా ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించాలని రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రవితేజ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక చాంబర్ కార్యాలయంలో గురువారం అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో 'ఉద్యోగస్తులకు యాజమాన్యం కల్పించవలసిన సౌకర్యాలు, స్కీముల' గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆత్మ నిర్బర్ భారత్ రోజ్గార్ యోజన స్కీమ్ ద్వారా ఇంతకుముందు ఉన్న సంస్థ కోడ్ ద్వారా కొత్త ఉద్యోగస్తులను నేర్చుకొనుటకు రిజిస్ట్రేషన్ గడువును పొడిగించామన్నారు. దీని ద్వారా కొత్తగా చేరిన ఉద్యోగస్తులకు రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి 24నెలల ఇన్సెంటివ్ వర్తిస్తుందని తెలిపారు. ఇంతకుముందు మరణాలకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్కు 30రోజులు పట్టేదని, కానీ ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా 2-3రోజుల్లోనే సెటిల్మెంట్ చేస్తున్నామని పేర్కొన్నారు. పెన్షన్ డే సందర్భంగా ఛాంబర్ కార్యాలయంలో పని చేస్తూ గురువారంతో 58 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అకౌంటెంట్ భానుమూర్తికి కమిషనర్ రవితేజ, చాంబర్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డిలు పెన్షన్ స్కీమ్ సర్టిఫికెట్ అందజేశారు. అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కమిషనర్ రవితేజను ఘనంగా సన్మానించి మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రావిడెంట్ ఫండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనాథ్, అకౌంటెంట్ అధికారి సూర్య ప్రకాష్, ఛాంబర్ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి మాధురి వేదప్రకాష్, కోశాధికారి ఆల్లె సంపత్, కార్యవర్గ సభ్యులు కేదారి హరినాథ్, గాజుల సుమన్, రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.