Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు మొక్కలు నాటే కార్యక్రమం భాగంగా ఖమ్మం గట్టయ్య సెంటర్ లోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయ ఆవరణంలో జమ్మి చెట్టును మంత్రివర్యులు పువ్వాడ అజరు కుమార్ నాటారు. హరితహారంతో అడవులు, పల్లెల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం కనపడుతుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని, గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి, పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీ ప్రసన్న, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, నగర్ అధ్యక్షుడు పగడాల నాగరాజ్, కార్పొరేటర్ కమర్తపు మురళి, బుర్రి వెంకటేశ్వరరావు, పార్టీ కార్యాలయ ఇంచార్జి ఆర్జేసీ కృష్ణ, ఆలయ చైర్మన్ గోలి అనూప్ పాల్గొన్నారు.