Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
పోడు రైతుల సమస్య పరిష్కారం కోరుతూ ఈనెల 5న అఖిలపక్షం తలపెట్టిన రహదారులు దిగ్బంధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు కోరారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఖమ్మం పట్టణ చింతకాని, కొణిజర్ల, రఘునాథపాలెం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జమ్ముల జితేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్కె జానిమియా, యర్రాబాబు, పోటు కళావతి, ఏపూరి లతాదేవి పాల్గొన్నారు.
రహదారుల దిగ్బంధనం జయప్రదం చేయండి : సీపీఐ(ఎం) రఘునాధపాలెం కార్యదర్శి ఎస్. నవీన్ రెడ్డి డిమాండ్
రఘునాథపాలెం : అటవీ ప్రాంతాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని రైతులపై పోలీసుల ఫారెస్ట్ అధికారుల నిర్బంధాన్ని ఆపాలని కోరుతూ అక్టోబర్ 5న కొణిజర్ల సెంటర్ నందు జరిగే రహదారుల దిగ్బంధనం కార్యక్రమాన్ని మండలంలోని పోడు రైతులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎస్. నవీన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న పోడు రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఒక్క రైతు కూడా హక్కు పత్రం ఇవ్వలేదని విమర్శించారు. ఫారెస్టు, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, గుగులోత్ కుమార్, నాగేశ్వరరావు, శ్రీను పాల్గొన్నారు.
పోడు పరిరక్షణకు 5న రాస్తారోకో
పెనుబల్లి : భూముల పరిరక్షణకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోడు సాగుదారులు ఈ నెల 5న రోడ్డెక్కనున్నారని పెనుబల్లి మండల అఖిలపక్ష పార్టీ నాయకులు ప్రకటించారు. పోడు భూములపై ఫారెస్ట్ అధికారుల దాడులకు నిరసనగా అఖిల పక్షాల పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం విఎం బంజర్ సెంటర్లో రహదారుల దిగ్బంధనంను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అఖిలపక్ష నాయకులు చెలమాల విట్టల్ రావు, కొమ్మినేని సుధాకర్, బీరెల్లి లాజరు, భుక్కా కృష్ణవేణి, మేకతొట్టి కాంతయ్య, కొలికపోగు వెంకటేశ్వరావు, నూనె గాంధీ, బెజవాడ సాయి శేషు పాల్గొన్నారు.