Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఆర్ఎస్ పార్టీలో మహిళలు లేరు
అ జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు
దేవి ప్రసన్న
నవతెలంగాణ-కొత్తగూడెం
టీఆర్ఎస్ పార్టీలో మహిళలకు స్థానంలేదని, రాష్ట్రంలో మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా...? అని జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలకు రాష్ట్రంలో భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందన్నారు. మొన్నటికి మొన్న చైత్ర ఘటన, నల్గొండలో ఒక మహిళ హత్య రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో ఒక దగ్గర ఇలాగే జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మహిళలను కించ పరిచే విధంగా మాట్లాడుతే సామాన్య ప్రజలు, మహిళల సహించరని హెచ్చరించారు. మొన్నటికి మొన్న దయాకర్ రావు, నిన్న నల్గొండ జిల్లాలో జగదీశ్ రెడ్డి మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు.
తాజాగా మాజీ మంత్రి రాజయ్య చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ద్వజమెత్తారు. వెంటనే మహిళాలోకానికి బహిరంగ క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ మహిళా నాయకురాలు వాలీ, చంద్రకళ, భాగ్య, చండ్రుగొండ మండల మహిళా నాయకురాలు కృష్ణవేణి, టేకులపల్లి మండల నాయకురాలు చంద్రకళ, అనసూర్య, రేరు అమ్మ తదితరులు పాల్గొన్నారు.