Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని చిన్నబండిరేవు గ్రామానికి చెందిన నల్లగట్ల ప్రవీణ్ అనే దళిత యువకుడు గత నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుడి కాలు విరిగి పోయింది. రెక్కాడితే డొక్కాడని ప్రవీణ్ కుటుంబ సభ్యులు దొరికినకాడల్లా అప్పులు చేసి వైద్యం అందించారు. కాలు శస్త్ర చికిత్సకు డబ్బులు అవసరం కావడంతో బాధిత కుటుంబ సభ్యులు మున్నూరు కాపు బాందవులను ఆర్ధిక సాయాన్ని కోరారు. దీంతో స్పందించిన మున్నూరు కాపు బాందవులు కొంత మంది దాతల సాయంతో సుమారు రూ.5 వేల నగదును ప్రవీణ్ తల్లి దండ్రులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్బంగా మున్నూరుకాపు సంఘం మండల కన్వీనర్ పూదోట సూరిబాబు మాట్లాడుతూ ఎదుటి వారికి సాయం చేసే దాంట్లో ఉన్న సంతృప్తి ఎక్కడ లభించదన్నారు. ప్రవీణ్ తల్లిదండ్రులు సైతం అవిటి వారు అని యువకుడి వైద్య ఖర్చుల కోసం దాతలు, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలన్నారు. నగదు అందజేసిన వారిలో మున్నూరుకాపు కుల బాందవులు కొమ్ము సురేందర్, పాశం వెంకటేశ్వర్లు, చిర్తాని చంద్రశేఖర్, తంత్రపల్లి సాగర్, తంత్రపల్లి శ్రీనివాసరావు, పూదోట మహేష్ తదితరులు ఉన్నారు.