Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రక్షణ కంటే భద్రత ముఖ్యం జీఎం సేఫ్టీ
నవతెలంగాణ-ఇల్లందు
ప్రతి ప్రమాదం వెనుక భద్రతా ప్రమాణాల లోపం కనిపిస్తోందని నిర్లక్ష్యపు పర్యవేక్షణతో ప్రమాదాలు జరుగుతున్నాయని జీఎం సేఫ్టీ కె.గురువయ్య అన్నారు. ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా సింగరేణి క్లబ్లో ఏరియా జీఎం మల్లెల సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గురవయ్య మాట్లాడారు. రక్షణ కంటే భద్రత ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం బండి వెంకటయ్య, ఏరియా రక్షణ అధికారి పంజాల శ్రీనివాసు, ప్రాజెక్టు అధికారులు వెంకటేశ్వర్లు, మల్లయ్య, గని రక్షణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.