Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మైనార్టీ జిల్లా అధ్యక్షులు యాకూబ్ పాషా
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న మైనార్టీ సమస్యలు ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశంలో ప్రతి పక్ష ఎమ్మెల్యేలు ప్రస్తావించాలని జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. పాలకులు మారుతున్న మైనార్టీల జీవితాల్లో ఎటువంటి మార్పు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్ బిల్లు ఈ శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని తెలిపారు. నాలుగేండ్లు గడుస్తున్నా నేటి వరకు అమలుకు నోచుకోలేదని తక్షణమే రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గల సుమారు 180 మైనార్టీ గురుకులాల పాఠశాలకు చెందిన అద్దె భవనాల కిరాయిలు రూ.60కోట్ల వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 333 ఉర్దూ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. అలాగే బీసీ-ఈ వర్గానికి చెందిన ముస్లింలకు ఓబీసీ జాబితాలో చేర్చాలని పేర్కొన్నారు.