Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అటవీ ఫలాలకు పెట్టింది పేరు
కొండెవాయి ఆదివాసి గ్రామం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
సీతాఫలం ఎంతో బలం అన్నారు. పెద్దలు . సీతాఫలాలు అక్టోబర్, సెప్టెంబర్ మాంసంలో సీజనల్‌గా తినే ఫలాలలో సీతాఫలం ఒకటి అనే చెప్పవచ్చు. సీతాఫలాలలో మిటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్టు సమృద్దిగా ఉంటాయని, అంతే కాకుండా రోగ నిరోధక వ్యవస్తను పటిష్ట పరచడాని సీతాఫలం ఎంతో మేలు చేస్తుందని దీంతో పాటు గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్‌ను నివారిస్తుంది.
మండల సరిహద్దు గ్రామమైన కొండె వాయి గిరిజన గ్రామం అటవీ ఫలాలకు పెట్టింది పేరు. పూర్తి వలస గొత్తికోయ గిరిజన గ్రామమైన ఈ గ్రామం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. సుమారు 50 గిరిజన కుటుంబాలు నివశించే గ్రామం చుట్టూ ఎటూ చూసినా సీతాఫలాల చెట్లు, నేరెడు పండ్ల చెట్లు, విప్ప చెట్లు, ఈత చెట్లు, తునికి చెట్లతో పాటు తాడి చెట్లు ఉంటాయి. కొండె వాయి గిరిజనులు సీజనల్ గా అటవీ ప్రాంతంలో పండే పండ్లను పర్ణశాల, సీతానారం, చిన్నబండిరేవు వంటి చుట్టు పక్కల గ్రామాలతో పాటు మండల కేంద్రమైన లకీëనగరం వచ్చి అమ్ముతుంటారు. ఒక విదంగా చెప్పాలంటే కొండె వాయి గిరిజనులు సీజనల్‌గా పండే ఫలాలను అమ్ముతూ అదే జీవనాధారంగా జీవిస్తుంటారు.. స్వచ్చమైన అటవీ ఫలాలను ప్రజలకు వారు చేరువ చేస్తున్నారనే చెప్పవచ్చు. కాగా ప్రస్తుతం సీతా ఫలాల కాలం కావడంతో గత పది రోజుల నుండి గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు పెద్ద ఎత్తున సీతా ఫలాలను మండల కేంద్రమైన లకీëనగరం తీసుకు వచ్చి అమ్ముతున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు దొరుకుతున్న సీతా ఫలాలను మండల వాసులతో పాటు పర్ణశాల దైవ దర్శనం కోసం వివిద ప్రాంతాలకు చెందిన వారు సైతం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు లభిస్తున్న కొండెవాయి సీతాఫలాలు తాజాగా, రుచిగా ఉండడంతో ప్రజలు సీతా ఫలాల కోసం ఎగబడుతున్నారనే చెప్పవచ్చు. స్వచ్చమైన, ఆరోగ్యకరమైన అటవీ ఫలాలపై నవతెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కధనం.