Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
మండలంలోని బోనకల్, ఆళ్లపాడు, రావినూతల జానకిపురం, గోవిందపురం ఏ, గోవిందాపురం ఎల్, తూటికుంట్లతో పాటు తదితర గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ... తెలంగాణ సంస్కతి సంప్రదాయాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఆడపడుచులకు అందించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో బోనకల్, గోవిందాపురం ఎల్, ఆళ్లపాడు, రావినూతల, జానకీపురం, గోవిందపురం- ఎ, తూటికుంట్ల గ్రామాల సర్పంచ్ లు భూక్య సైదా నాయక్, ఉమ్మనేని బాబు, మర్రి తిరుపతిరావు, కొమ్మినేని ఉపేందర్, చిలక వెంకటేశ్వర్లు, భాగం శ్రీనివాసరావు, నోముల వెంకట నరసమ్మ ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, ఉప సర్పంచ్ లు యార్లగడ్డ రాఘవ రావు వు, బోయినపల్లి ఏడు కొండలు, గీర్దావర్ గూగుల్ లోతు లక్ష్మణ్ నాయక్, ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత, పంచాయతీ కార్యదర్శులు వరుగు గోపి, కామిశెట్టి నరసింహారావు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సహకార సంఘం అధ్యక్షులు, గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కామేపల్లి : గోవింద్రాలలో బతుకమ్మ చీరలను విఆర్ఓ బాలాజీ పంపిణీ చేశారు.
కారేపల్లి : పోలంపల్లి పంచాయతీలో జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, సర్పంచ్ గుగులోత్ సక్రు బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేరుపల్లి పంచాయతీలో వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సర్పంచ్ అజ్మీర నాగేశ్వరరావు, కమలాపురంలో ఎంపీటీసీ దారావత్ పాండ్యానాయక్, సర్పంచ్ వట్టం ఉమారాణి, విశ్వనాధపల్లిలో సర్పంచ్ హలావత్ ఇందిరాజ్యోతి, కొత్తతండాలో సర్పంచ్ తేజావత్ మంగమ్మ, మంగళితండాలో సర్పంచ్ పిల్లలమర్రి స్వర్ణ, గుట్టకిందిగుంపులో సర్పంచ్ ఎట్టి రజినిరామారావు, నాననగర్ లో సర్పంచ్ మాలోత్ రాంజీ, గేటు కారేపల్లిలో సర్పంచ్ కల్పన లు చీరలను లబ్ధిదారులకు అందజేశారు.