Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
2023లో తెలంగాణ పార్టీ మూడోసారి అధికారంలోకి రావాలని, ఉమ్మడి జిల్లా 10 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని మంత్రి పువ్వాడ అజరుకుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. టిఆర్ఎస్ పార్టీ నూతనంగా ఎన్నికైన గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కమిటీలు అనుబంధ సంఘాల కమిటీలు ఆదివారం మధిర టీవీఎం స్కూల్లో ప్రమాణ స్వీకార మహౌత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా అధ్యక్షులు, కార్యదర్శులకు ప్రమాణ స్వీకార మహౌత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజరు కుమార్ మాట్లాడుతూ కెసిఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో దీక్ష చేసి ఆనాటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణను సాధించామని తెలిపారు. ప్రజల వద్దకు పదవిలో ఉన్న పదవిలో లేకపోయినా నాయకుడు వస్తే గౌరవించాలని, ఐక్యమత్యంతో ముందుకు సాగాలని, వర్గాలు లేవు, కులాలు లేవు గులాబీ కండవ మీద ఉంటే పదవులు తప్పక వస్తాయని తెలిపారు. మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పదవి లేకపోయినా అందరికి అండగా ఉంటానని, ఇక్కడ ఎవరి బ్రాండ్ లేవని ఉన్నదంతా కేసీఆర్ బ్రాండ్ అని అన్నారు. కెసిఆర్ పథకాలు ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసిసిబి చైర్మన్ నాగభూషణం, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాత మధు, మధిర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.