Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జడ్పీటీసీ వాగబోయిన రామక్క
నవతెలంగాణ-గుండాల
స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లింగాల ఘనపూర్ మండలంలో బతకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం అమానుషమని గుండాల జడ్పీటీసీ వాగబొయిన రామక్క అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీనియర్ ఎమ్మెల్యే, మంత్రిగా కూడా పనిచేసిన తాటికొండ రాజయ్య మహిళలను అవమానించడం సరి కాదని భేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనియెడల మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకోవలసి వస్తుందని హెచ్చరించారు. గతంలో మరో మంత్రి పల్లె ప్రగతి సభలో మహిళా ఎంపీడీవోను అవమాన పరచారని రోజురోజుకు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మతిస్థిమితం కోల్పోయి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని వీరిపై మహిళాలోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రోళ్లగడ్డ ఎంపీటీసీ గుండాల వైస్ ఎంపీపీ కల్తి రాజేశ్వరి, శంభునిగూడెం ఎంపీటీసీ పర్శిక పద్మ, శెట్టుపల్లి సర్పంచ్ కల్తి ప్రమీల పాల్గొన్నారు.