Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
వాల్ ఆఫ్ కైండ్నెస్ను భద్రాచలానికి తీసుకురావడం అభినందనీయమని భద్రాచలం ఏఎస్పీ జి.వినీత్ అన్నారు. వాల్ ఆఫ్ కైండ్నెస్లోని ఇబ్బందులను అధిగమించటానికి దేశంలోనే ప్రప్రథమంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో షెడ్ ఆఫ్ కైండ్నెస్ను బెక్కంటి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో భద్రాచలంలో ఏర్పాటు చేయటం అందరికీ ఆదర్శమని అన్నారు. ఆదివారం ఏయస్పీ చేతుల మీదుగా షెడ్ ఆఫ్ కైండ్‌నెస్ షెడ్‌ను ఘనంగా ప్రారంభించి పేదలకు అంకితం ఇచ్చారు. ఈ కార్యక్రంమలో ఐటీసీ భద్రాచలం చీఫ్ మేనేజర్ డి.చెంగల్ రావు మాట్లాడారు. ఐటీసీలోని రోటరీ ఇన్ భద్ర ద్వారా బట్టలను వస్తువులను సేకరించి ఆట దయగల షెడ్డుకు ప్రతినెలా అందేవిధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గ్రీన్ భద్రాద్రి చైర్మెన్ భోగాల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బెక్కంటి శ్రీనివాస్ ఛారిటబుల్ ట్రస్ట్ సామాజిక సేవలో భాగంగా పేదలకు ఉపయోగపడే అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టటం అటు పిల్లలకు ఇటు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని అన్నారు. డాక్టర్ పుల్లయ్య మాట్లాడుతూ స్టాళ్ ప్రారంభించిన నాడే పెద్ద ఎత్తున అనూహ్య స్పందన రావటం ఎంతో మంది పేదలు వచ్చి బట్టలు తీసుకుపోవటం తనకెంతో ఆనందం కలిగిందని అన్నారు. ఈ స్పందనే ఆట దయగల షెడ్ విజయవంతానికి పునాది అవుతుందని అన్నారు. అనంతరం గ్రీన్ భద్రాద్రి ఛైర్మెన్ భోగాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దయగల షెడ్డుకు ఇరువైపులా విశిష్ట అతిథుల చేతులమీదుగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఆర్గనైజర్లు పోతుల రమేష్ బాబు, కెబిఎస్ ఉమాదేవి, జి.సాయిజి, కె.వరప్రసాద్, జీ.భూషణరావు, జగన్నాథా చార్యులు, ధనుంజయరావు, ఓం శాంతి ఆర్గనైజర్లు, సీపీఐ(ఎం) నాయకులు యం.బీ.నర్సారెడ్డితోపాటు గ్రీన్ భద్రాద్రి సభ్యులు కృష్ణారెడ్డి, మాధవరెడ్డి, ప్రసాద రెడ్డి, లాయర్ తిరుమలరావు, భద్రాచలం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.స్వామి, భద్రాచలం ట్రాఫిక్ యస్.ఐ తిరుపతితో పాటు పలువురు పాల్గొన్నారు.