Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వామ, విపక్షాల నాయకులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
పోడు భూముల హక్కుల సాధన కోసం వామపక్షం, విపక్షం, ప్రతిపక్షం, పలు సామాజిక సంఘాల ఆధ్వర్యంలో పోడు రైతు పొలికేక పేరుతో 5 మంగళవారం అశ్వారావుపేట నుండి ఆదిలాబాద్ వరకు తలపెట్టిన రోడ్ల దిగ్బంంధాన్ని విజయవంతం చేయడాని ప్రతీ కార్యకర్త సహకరించి పాల్గొనాలని ఆయా పార్టీల జిల్లా కార్యదర్శులు, ముఖ్య నాయకులు ఆయా శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఆదివారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం అయిన సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కార్యదర్శులు అన్నవరం కనకయ్య, షాబీర్ పాషా మాట్లాడుతూ....పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, సాగు దారులపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని, పార్టీల నాయకులు నిర్బంధాలు నిలిపి వేయాలన్నారు. 2006లో తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందిగా అమలు చేయాలన్నారు. పోడు పంటలు ద్వంసం, ఆ భూములు చుట్టూ కందకాలు తీయడం ఆపి వేయాలన్నారు. ముఖ్యమంత్రి హామీ మేరకు 2014 జూన్ ప్రాతీపధికగా అటవీ హక్కుల చట్టం అమలు చేసి పోడు రైతులందరికీ సాగులో ఉన్న భూములకు హక్కు కల్పించాలన్నారు. అటవీ హక్కుల చట్టం నీరుగార్చడానికి మోడీ ప్రభుత్వం తెచ్చిన నూతన అటవీ విధానం-2019ను రద్దు చేయాలన్నారు. జిల్లాలో 16 కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ దిగ్బందనానికి సీపీఐ(ఎం), సీపీఐ, ఎన్డీ, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడా వెంకట రెడ్డి, పోటు రంగారావు, రేవంత్ రెడ్డి, గోవర్ధన రెడ్డిలు అశ్వారావుపేట రానున్నారని ప్రకటిం చారు. ఈ కార్యక్రమంలో కొక్కెరపాటి పుల్లయ్య, గోకినపల్లి ప్రభాకర్ రావు, నరాటి ప్రసాద్, గన్నిన రామక్రిష్ణ, రఫీ, తుమ్మా రాంబాబులు పాల్గొన్నారు.
గుండాల 5న రోడ్ల దిగ్బంధనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎన్డీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన అఖిలపక్షం సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని లక్షల ఎకరాల భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తే దెబ్బతినని పర్యావరణం ఆదివాసీలు ఎకరమో!రెండెకరాలో పోడు సాగు చేస్తేనే పర్యావరణం దెబ్బతింటుందా..? ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ 5న అశ్వరావుపేట నుండి అదిలాబాద్ వరకు జరిగే రోడ్ల దిగ్బంధం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. హరితహారం పేరుతో ఆదివాసీల భూములను గుంజుకోవడం సీఎం కేసీఆర్‌కే చెల్లిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీ జిల్లా నాయకులు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, సబ్ డివిజన్ నాయకులు, సర్పంచ్ కోరం సీతరాములు, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు జె.సీతారామయ్య, సాగరన్న, ఎదల్లపల్లి సత్యం, తుడుందెబ్బ జిల్లా నాయకులు శ్రీను, ఎర్రయ్య, కాంగ్రెస్ మండల నాయకులు పాపారావు, సీపీఐ మండల కార్యదర్శి రమేష్, పీవైఎల్ జిల్లా నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి 5న జరగనున్న రోడ్ దిగ్బంధనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని న్యూడెమోక్రసీ రాష్ట్రకార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పోడు భూముల రక్షణ కోసం అఖిలపక్ష రాజకీయపార్టీల పిలుపు మేరకు ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివారం టేకులపల్లిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో న్యూడెమోక్రసీ ఖమ్మం-వరంగల్ జిల్లాల ఏరియా కమిటీ నాయకులు జే.సీతారామయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఊక్లా, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కళావతి, రైతు కూలీ సంఘం నాయకులు హరిజా, కిర్యా, మంచా, శంకర్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం : పోడు సాగు దారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఈనెల 5వ తారీఖున జరుగు సడక్ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు జాటోత్ కృష్ట కోరారు. ఆదివారం లక్ష్మీదేవి పల్లి మండలం రేగళ్ళ పెద్ద తండా, ఉయ్యాలబడవ, సూర్య తండ, దూది తండా, బావోజీ తండా, కొత్తూరు, గట్టు మల్ల, గంగమ్మ కాలనీ, మాదిగ పోవు గ్రామాల్లో పోడు సాగు దారులతో గ్రూప్ మీటింగ్‌లు నిర్వహించి, మాట్లాడారు.కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి నల్లమల సత్యనారాయణ, మండల నాయకులు ఉప్పెన పల్లి నాగేశ్వరరావు, కోబాల్, ధరావత్ వెంకన, సూర్య, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లిక్కి బాలరాజు, పార్టీ పట్టణ కార్యదర్శి భూక్యా రమేష్,. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.