Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎం.సాయిబాబు
నవతెలంగాణ-పాల్వంచ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ సవరణ బిల్లు 2021 వినాశకరమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.సాయిబాబా అన్నారు. పాల్వంచలో శనివారం తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ బాడీసమావేశం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కొలగాని రమేశ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అథితిగా పాల్గొన్నా ఆయన ప్రసంగిస్తూ విద్యుత్‌రంగంలో 2003 సంవత్సరం నుండి విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ పోరాటం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టం సవరణ బిల్లు 2021 పార్లమెంట్లో బిల్లు పాసైతే విద్యుత్ కార్మికులు ఉద్యోగులకు వినియోగదారులకు తీవ్రనష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ విద్యుత్ చట్ట సవరణ బిల్లు రైతులకు ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ, క్షవర వృత్తిదారులు, రజకులకు ఉచిత విద్యుత్ లేకుండా పోతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అన్ని రంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే కార్మిక చట్టాల మార్పు కార్మిక కోడ్లకు కార్మివకర్గం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం టీఎస్ యుఈఈయు ఎన్పిడిసిఎల్ కార్యదర్శి ఎం.ప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ కార్మికులు మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని కిందిస్థాయి సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల వినియోగదారులకు సరైన సర్వీసులు చేయలేకపోతున్నారని అన్నారు. కిందిస్థాయి ఒ ఆండ్ ఎం సిబ్బంది ఖాలీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని బిల్ కలెక్టర్లు, మీటర్రీటర్స్, జిఓ నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని అన్‌మ్యాన్ వర్కర్స్కు 5 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాంఢ్ చేశారు. ఈ సమావేశంలో టిఎస్యుఈఈయు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంగ్ ఎన్.స్వామి, జిల్లా కార్యదర్శి బొల్లి వెంకట్రాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కే.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూనరాజు శ్రీనివాస్, కొత్తగూడెం డివిజన్ అధ్యక్షులు వెంకన్న, పులి గగేష్, భద్రాచలం డివిజన్ నాయకులు పదిలం శ్రీనివాస్, బండి రమేశ్, శంకర్, సత్యనారాయణ, జిల్లా వ్యాప్తంకార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అద్యక్షులు ఎజే రమేశ్, ఉపాధ్యక్షులు కె.బ్రహ్మచారి ప్రసంగించారు.