Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
మండలంలోని ఈ బయ్యారం అటవీ రేంజ్ పరిధిలో మల్లారం బీట్ రిజర్వ్ ఫారెస్ట్ జానంపేట కంపార్ట్మెంట్ నెంబర్ 34లో నమ్మదగిన సమాచారం మేరకు అక్కడకు వెళ్ళగా కొంతమంది వ్యక్తులు అడవిని నరుకుతూ కనిపించారని వారిని పట్టుకొని కేసు నమోదు చేశామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని తెలియజేశారు. మల్లారం గ్రామానికి చెందిన జాడి రాంబాబు, కొమరం శివప్రసాద్, జాడి కిరణ్, షేక్ ఖాదర్ బి, జాడి కౌసల్య అనే వ్యక్తులపై అటవీ హక్కుల చట్టం 1967, 1970ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిని జ్యుడీషియల్ కోర్టు మణుగూరు తరలించామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎఫ్ఆర్వో అరుణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు రవీందర్, ఉపేందర్, వేణు, నాగేంద్రబాబు, సిబ్బంది పాల్గొన్నారు.