Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీఎంకు వినతి
నవతెలంగాణ-మణుగూరు
ఓసీ-2 లో జరిగిన డంపర్ బొలెరో ప్రమాదంలో చనిపోయిన ప్రైవేటు కన్వినెన్స్ వాహన డ్రైవర్ సింగరేణి భూనిర్వాసితుడు వేల్పుల చిన వెంకన్న కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టియుసి, సిఐటియుహెచ్ఎంఎస్, బిఎంఎస్, ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు ఎస్డి నాసర్‌పాషా, నాయకులు వీరస్వామి (ఏఐటీయూసీ), వెలగపల్లి జాన్ (ఐఎన్టియుసి), వి.వెంకటరత్నం, టీవీవీ ప్రసాద్, (సీఐటియు) రవీందర్రావు (బిఎంఎస్), ఎర్ర కనకయ్య తదితరులు పాల్గొన్నారు.